Press ESC to close

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. 35 వేలకు పైగా గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు!

Grand Summer Internship Fair 2025: దేశవ్యాప్తంగా 35 వేలకు పైగా ఇంటర్న్‌షిప్‌లు అవకాశాలు వచ్చేసాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ లో వచ్చిన దరఖాస్తుల ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపిన వారికి ఒక విభాగంలో ఎంపిక కాకపోయినా మరొకదాంట్లో ఎంపికయ్యే ఛాన్స్‌ ఉంటుంది..

ప్రముఖ కంపెనీలు బ్లింక్‌ఇట్, ఫోన్‌పే, కల్ట్‌ఫిట్, కార్స్‌24, వేక్‌ఫిట్, ఆడి, ఓయో, పైసాబజార్, రేడియో మిర్చి, బిగ్‌బాస్కెట్, హిందుస్థాన్‌ టైమ్స్, ఫస్ట్‌ క్రై, థామస్‌కుక్, అర్బన్‌కంపెనీ వంటి ఎన్నో ప్రముఖ సంస్థలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా చేసుకోవచ్చు. మార్కెటింగ్, లా, అకౌంటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్, పైతాన్‌ డెవలప్‌మెంట్, కంటెంట్‌ రైటింగ్, సేల్స్, హ్యూమన్‌ రిసోర్సెస్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, గ్రాఫిక్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్, ప్రోగ్రామింగ్, ఫైనాన్స్‌ విభాగాల విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Also Read: Snowflake – Nasscom: లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Grand Summer Internship Fair

నెల వ్యవధి నుంచి 6 నెలల కాలం వరకు వివిధ రకాల ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. విద్యార్ధుల ఆసక్తిని బట్టి పార్ట్‌టైమ్‌ ఇంటర్న్‌షిప్‌లు, రెగ్యులర్‌ ఇంటర్న్‌షిప్‌లు ఎంచుకోవచ్చు. ఈ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు మార్చి నుంచి జూన్‌ వరకూ ఉంటాయి. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలో పని చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు 60 వేల వరకూ స్టైపెండ్‌ ఇస్తారు. మరియు సర్టిఫికెట్‌ కూడా అందజేస్తారు.

విద్యార్ధులు తమకు అనుకూలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఇన్‌-ఆఫీస్, వర్చువల్, పార్ట్‌-టైమ్, ఇంటర్నేషనల్‌ ఇంటర్న్‌పిప్‌లు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ తర్వాత భారీ జీతంతో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

Click Here To Register For Grand Summer Internship Fair 2025

Also Read: SBI YOUTH FOR INDIA FELLOWSHIP 2025 | Eligibility: Degree | Fellowship: 3,27,000 Per year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *