Press ESC to close

KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు

High Court Notices to BRS MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు, ఈసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్‌ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి (K.K. Mahender Reddy), లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కొడుకు హిమాన్షుకు (Himansh) ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జడ్జి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేటీఆర్, ఈసీకి నోటీసులు ఇచ్చారు.

తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో 32 ఎకరాలు, శివారు వెంకటాపూర్‌లో మరో 4 ఎకరాలు కొడుకు హిమాన్షు పేరు మీద ఉందని.. కానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆ ఆస్తులను ప్రస్తావించలేదని అభ్యంతరం తెలిపారు. గతేడాదే మేజర్‌ అయిన కొడుకు హిమాన్షు సొంత డబ్బుతో భూములు కొనే అవకాశం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో నిజాలు దాచిన కేటీఆర్‌ను (KTR) అనర్హుడిగా ప్రకటించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read: ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *