Press ESC to close

WWE: హైదరాబాద్ లో రెజ్లింగ్ పోటీలు

Hyderabad to Host WWE Superstar Spectacle Event : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) గురించి తెలియని వారుండరు. WWE ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు.  WWE(World Wrestling Entertainment) పోటీలకు మన హైదరాబాద్ నగరం లో నిర్వహించనున్నారు.

హైద‌రాబాద్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 8 నుంచి ఈ WWE Superstar Spectacle Event ప్రారంభం కానుంది. గ‌చ్చిబౌలిలోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ రెజ్లింగ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ WWE పోటీలకు మన హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇండియాలో ఈ ఈవెంట్ రెండోసారి జరగ‌నుండడం విశేషం.



2017లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో(Indira Gandhi Indore Stadium) ఈ పోటీలు జ‌రిగాయి.

ఈ WWE Superstar Spectacle Event సంబంధించిన పోస్ట‌ర్‌ను తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ విడుదల చేశారు.

ఈ పోటీల్లో అంత‌ర్జాతీయంగా ప్ర‌సిద్ధి చెందిన 28 మంది రెజ్లింగ్ స్టార్లు పాల్గొన‌నున్నారు.ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌, ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ ది రింగ్ జనరల్ గుంథర్, జిందర్ మహల్ (Jindar Mahal), వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి స్టార్‌లు ఇందులో పోటీప‌డ‌నున్నారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న ఈ ఈవెంట్ టికెట్లు www.bookmyshow.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *