IBPS Clerk Notification 2024: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల (Clerk Posts) భర్తీకి ఐబీపీఎస్ CRP Clerk -XIV నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 6128
తెలంగాణలో – 104 ఖాళీలు
ఏపీలో – 105 ఖాళీలు
విద్యార్హత:
2024, జూలై 1 నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కంప్యూటర్ సిస్టమ్స్ పై ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
దీనికి సంబంధించి అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజెస్లో సర్టిఫికెట్/ డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి లేదా. కంప్యూటర్/ఐటీ ఒక సబ్జెక్టుగా హైస్కూల్ లేదా కాలేజీ చదివి ఉండాలి.
స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి..
వయస్సు:
2024, జూలై 1 నాటికి 20-28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్సీఎల్)లకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రెండు దశల్లో ఎంపిక ఉంటుంది
ప్రిలిమినరీ, మెయిన్ ఆన్లైన్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్
ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
• దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
మొత్తం 100 ప్రశ్నలు. 100 మార్కులు, పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
• ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్న బ్యాంకులు
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ & సింధ్ బ్యాంక్
యూకో బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మెయిన్ ఎగ్జామ్
ఇది కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు.
అబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
దీనిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
మొత్తం 190 ప్రశ్నలు, 200 మార్కులకు పరీక్ష ఉంటుంది..
పరీక్ష కాలవ్యవధి: 160 నిమిషాలు
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్లో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
తుది ఎంపిక: మెయిన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.

Leave a Reply