
చలికాలం స్టార్ట్ అయ్యింది. ఈ కాలంలో దగ్గు మరియు జలుబు వేధిస్తుంది. వీటి నుంచి బయటపడేందుకు చాలా మంది మందులు తీసుకుంటారు. ఇంకొంతమంది చలికాలంలో రాత్రిపూట బ్రాందీ కానీ రమ్ కానీ తాగితే..దగ్గు, జలుబు తగ్గుతుందనుకుంటారు. అసలు ఇందులో నిజమెంత. శాస్త్రీయంగా ఏది సరైనది. ఇందులో ఉన్న నిజామేంటో చూద్దాం…
బ్రాందీ, రమ్ తాగితే జలుబుతోపాటు, కీళ్ల నొప్పులు, రుమాటిజంయ కూడా నయం అవుతుందని శాస్త్రీయంగా పేర్కొంటున్నారు. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట.
సైన్స్ ఏం చెబుతోంది?
సైన్స్ మాత్రం ఆల్కహాల్ వెచ్చదనాన్ని అందిస్తుందని చెబుతోంది. అంటే ఆల్కహాల్ శరీరానికి మరింత వేడిని అందిస్తుంది. కానీ రోగాలు నయం చేస్తుందన్న వాదనలు చూస్తే మాత్రం పూర్తి నిరాధారమైదిగా కనిపిస్తాయి. రమ్ లేదా బ్రాందీ అయినా…మీ శరీరం ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి.
ఇక కొంచెం మందు తాగితే పర్లేదని.. అప్పుడప్పుడు మద్యం సేవించవచ్చని కొంతమంది చెబుతుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజంలేదని డాక్టర్లు కుండబద్దలు కొడుతున్నారు. ఒకవేళ ఎవరైనా డాక్టర్ ఇలా కొంచెం తాగమని చెబితే అతడిని అసలు నమ్మవద్దని మెడికల్ ప్రొఫెషనల్స్ తేల్చిచెబుతున్నారు. ఆల్కహాల్ వల్ల ప్రయోజనాలు ఏ మాత్రం లేవని ఖరాఖండిగా చెబుతున్నారు. ఆల్కహాల్ వినియోగం మీ ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఆల్కహాల్ ప్రజలను పేదలుగా, మూగగా, లావుగా, అనారోగ్యంగా మారుస్తుంది.
మానసిక సమస్యలు:
ఆల్కహాల్ అనేది ఒక అడిక్షన్. దీర్ఘకాలిక ఆల్కహాల్ వినియోగం డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఆల్కహాల్ వినియోగం ప్రమాదకర ప్రవర్తనలకు దారితీస్తుంది. సంబంధాలు, ఉపాధి మరియు మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.

Leave a Reply