IBSA: భారత్ కు స్వర్ణం.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు
మహిళల అంధుల క్రికెట్ జట్టు(women’s blind cricket team) చరిత్ర సృష్టించింది. తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్ 2023లో మన టీమిండియా అమ్మాయిలు స్వర్ణం సాధించారు.
మొదటి ఎడిషన్‌లోనే మన జట్టు టైటిల్ గెలవడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
వర్షం వలన డక్‌వర్త్ లూయిస్ ప్రకారం (DLS method) నిర్ణయించిన 42 పరుగుల లక్ష్యాన్ని మన బ్యాటర్లు కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులే చేసింది.

Leave a Reply