
Pawan Kalyan visit to Bhimavaram was postponed :
హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతించకపోవడంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన వాయిదా
అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణం
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ (Janasena Pawan Kalyan) గారి భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నట్లు అర్థమవుతోంది. విష్ణు కాలేజీలో (Vishnu College) ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉన్నాయి. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులతో అనుమతుల విషయంలో మెలికలుపెట్టిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నాం.
డైలమాలో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు.
అమలాపురంలోనూ హెలీపాడ్ ఏర్పాటుకు ఆర్ అండ్ బి ఇబ్బందులు పెడుతున్నారని జనసేన (Janasena) ఆగ్రహం.హెలీకాప్టరులో పర్యటనలకు వెళ్లి రాత్రికి అమరావతి (Amaravati) వచ్చేలా పర్యటనలను షెడ్యూల్ చేసుతున్న పవన్. ఎన్నికల కసరత్తు చేపట్టాల్సి ఉన్నందున ప్రతి రోజూ పార్టీ కార్యాలయానికి రావాలని భావించిన పవన్. వివిధ ప్రాంతాల్లో హెలీపాడ్ల ఏర్పాటుకు ఆర్ అండ్ బి అనుమతులు నిరాకరించడంతో ఆగ్రహం. పవన్ పర్యటనలను రీ – షెడ్యూల్ చేసే పనిలో జనసేన.
Also Read: జనసేన – టీడీపీ ప్రభుత్వంలో యువతకు ఉన్నచోటే ఉపాధి అవకాశాలు

Leave a Reply