
Karthi Satyam Sundaram: కోలీవుడ్ స్టార్స్ కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ చిత్రం గత నెల 28న థియేటర్లలో విడుదలై ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి పోటీగా తెలుగులో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
ఈ సినిమాలో కార్తీ నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. సినిమాలో చెప్పుకోవడానికి గొప్ప కథ ఏమీ లేదు.
కానీ చిన్నచిన్న భావాలను కూడా అందంగా చూపించిన తీరు, అలాగే కుటుంబం, బంధుత్వాలు ఏర్పరచుకున్న తీరు మీ కంట కన్నీరు తెప్పిస్తాయి. ’96’ అనే క్లాసిక్ చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Leave a Reply