
KA Movie OTT Release: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavarm) నటించిన లేటెస్ట్ సినిమా క. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ క సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘క’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 28 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో (ETV WIN) స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. భారీ ధరకే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు టాక్. శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కిరణ్ సరసన యంగ్ బ్యూటీ తాన్వి, నయన్ సారిక ఫీమేల్ లీడ్స్ గా నటించారు.
ఆడుదాము #KA చ్చితంగా,
ఈసారి అదిరిపోయే సప్పుడు తో అద్భుతమైన పిక్చర్ తో…🔈🔉🔊Experience #KA with Dolby Vision Atmos 🤩
From Nov 28 Only on @EtvWin
A @SamCSmusic musical 🎶@Kiran_Abbavaram @UrsNayan @tanviram_ @DirSujith @sandeep_deep02 @srichakraas #KiranAbbavaram #EtvWin pic.twitter.com/VbwOIFS9e4— ETV Win (@etvwin) November 23, 2024

Leave a Reply