
Medico Rachana Reddy Suicide News: సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ఓఆర్ఆర్ (ORR) బైపాస్ రోడ్డులో ఖమ్మం మమత కళాశాలలో పీజీ చదువుతున్న రచనారెడ్డి(Medico Rachana Reddy) కారులో అపస్మారక స్థితిలో కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి తరలించగా వైద్యురాలు రచనారెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందింది.
వైద్యురాలు రచనా రెడ్డికి మత్తు ఇంజక్షన్ వేసి స్పృహ కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు కృష్ణారెడ్డిపేట్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు పక్కన డాక్టర్ రచనా రెడ్డి తన కారును ఆపి మందు ఇంజక్షన్ తీసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు మృతి చెందింది. అయితే రచనారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వైద్యురాలు రచనారెడ్డి మృతిపై అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు.
గతేడాది నవంబర్ లో రచనాకు నిశ్చితార్థం కాగా.. ఈ మార్చిలో ఆమె పెళ్లి. ఈలోపే రచనా ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిశ్చితార్థం చేసుకున్న అబ్బాయితో డాక్టర్ రచనా రెడ్డి కి మనస్పర్థలు?. ఆ సమయంలోనే వైద్యురాలు రచనా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.
Also Read: Punjab National Bank Recruitment 2024 – 1025 Specialist Officer Posts

Leave a Reply