
Mee Seva Centers in Telangana: తెలంగాణ ప్రభుత్వం నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటు కొరకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జిల్లా – నూతన మీ సేవ కేంద్రముల వివరములు
ఖాళీలు:
భీమారం (01)
జగిత్యాల (రూరల్) (01)
సారంగాపూర్ (01)
మెట్ పల్లి (01) మండలముల గ్రామ పంచాయతీ పరిధిలో నూతనముగా ఏర్పాటు చేయు మొత్తం (04) మీసేవ కేంద్రములకు, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనైనది.
అప్లై విధానం:
ఆసక్తి గల అభ్యర్ధులు https://jagtial.telangana.gov.in/ నందు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత విద్యార్హత పత్రాలను జత చేసి సంబంధిత తహసిల్దార్ వారి కార్యాలయము నందు సమర్పించగలరు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు సమర్పించు తేది: 26/11/2024 ఉదయం 10.30 ని.ల నుండి తేది: 04/12/2024 సాయంత్రం 5.00 గం. ల లోపు కార్యాలయము పని వేళలలో మాత్రమే.
* దరఖాస్తుదారు దరఖాస్తు ఫారమ్ ను నింపి, సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో ఫారమ్ ను సమర్పించాలి. * జగిత్యాల జిల్లా అధికారిక వెబ్ సైట్ https://jagtial.telangana.gov.in/ నుండి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోగలరు:
అర్హత:
* ధరఖాస్తు దారుడు నిరుద్యోగి అయి ఉండవలెను.
* దరఖాస్తుదారు దరఖాస్తుతో పాటు రూపాయలు 500/- DD (Non-Refundable) District Collector, Jagtial గారి పేరు మీద కట్టి అర్జీతో సమర్పించగలరు.
*ఏదైనా గ్రా౦డ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారు తప్పనిసరిగా అకాడమిక్ సర్టిఫికెట్లు మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. * అవసరమైన మౌలిక సదుపాయాలను పెట్టుబడి పెట్టడానికి తగిన స్థోమత కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారు యొక్క వయసు 18-35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారు జగిత్యాల జిల్లాలోని అదే మండలానికి, గ్రామ పంచాయితీ లేదా సమీప గ్రామ పంచాయితీకి చెందినవారై ఉండాలి.
*మీ సేవ కేంద్రమునకు ఎంపిక చేయబడిన అభ్యర్థి, వారి మండలములో నిర్దేశించబడిన ప్రదేశములో మాత్రమే కేంద్రము ఏర్పాటు చేయవలెను. తదుపరి ఎటువంటి కారణం చేతనైనా స్థాన మార్పిడికి అనుమతించబడదు.
*సర్టిఫికేట్ వేరిఫికేషన్ సమయంలో కింది సర్టిఫికెట్లు అథారిటీ ద్వారా తనిఖీ చేయబడతాయి.
i. SSC నుండి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు.
ii. నివాస ధృవీకరణ పత్రం.
iii. కుల ధ్రువీకరణ పత్రం.
* దరఖాస్తుకు అనుబంధముగా సమర్పించబడిన ఆధార పత్రాలు అన్నీటిపై ఆధీకృత దృవీకరణ (గెజిటేడ్ అటెస్టేషన్) చేయించి జతపరచవలెను.
* తనిఖీలో అనుమతించబడిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి పరీక్షకు అర్హత ఇవ్వబడును.
పరీక్షా విధానం:
* IT నైపుణ్యాలను (100 మార్కులు) అంచనా వేయడానికి వ్రాత పరీక్ష నిర్వహించబడును.
* వ్రాత పరీక్ష ప్రాధమిక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసేవా సర్వీసెస్ (ఆబ్జెక్టివే టైప్) పై ఉంటుంది.

Leave a Reply