Press ESC to close

బాలకృష్ణ ‘అఖండ 2 -తాండవం’ ప్రోమో మరియు రిలీజ్ డేట్ అనౌన్స్

బాలయ్య  బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.

మరోవైపు బాలయ్య ‘అఖండ 2’ కూడా మొదలు పెట్టేశాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఎలాంటి హిట్లు లేక సతమతమవుతున్న బాలయ్యకు ‘అఖండ’ మూవీ ఆకలి తీర్చింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ‘అఖండ 2’ మూవీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు కీలక అప్డేట్ వదిలారు.



ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. వచ్చే ఏడాది దసరా కానుకంగా సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ ప్రోమో సైతం రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య కూతురు తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ అచంట – గోపీ అచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై బారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *