Press ESC to close

నేడు కేసీఆర్ గారి సమక్షంలోబీఆర్‌ఎస్‌ లోకి చేరుతున్నఆర్‌ఎస్పీ!

RS Praveen Kumar Joining in BRS Party: బహుజన్‌ సమాజ్‌ పార్టీకి (BSP) రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ (RS Praveen Kumar) సోమవారం గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ (KCR) సమక్షంలో BRS పార్టీలో చేరుతున్నట్లు ట్విటర్‌ (Twitter) వేదికగా వివరించారు.



తెలంగాణ ప్రజలకు నమస్కారం…..
నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా.. దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి.

జై భీం. జై తెలంగాణ. జై భారత్…. – RS Praveen Kumar



16 March Tweet:




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *