Press ESC to close

హైదరాబాద్‌ నడిబొడ్డున మర్డర్ – లైవ్ వీడియో

హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. అంతా చూస్తుండగానే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బాలాపూర్‌లోని రాయల్‌ కాలనీలో చోటుచేసుకుంది. సమీన్ (28)ని రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. కత్తి, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. హత్య అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

హత్య సమయంలో ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *