Snowflake partners with Nasscom to equip 100,000 learners in India with Data and AI skills
Snowflake Nasscom: ప్రపంచవ్యాప్తంగా AI ట్రెండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో నాస్కామ్ (NASSCOM – National Association of Software and Service Companies) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా (Data) నైపుణ్యాలు నేర్చుకునేందుకు లక్ష మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది.
నాస్కామ్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సంయుక్తంగా స్నోఫ్లేక్‌తో (Snowflake) ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్లాట్ ఫాం ద్వారా విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం AI నిపుణుల డిమాండ్, సరఫరా మధ్య కొంత గ్యాప్ ఉంది. నాస్కామ్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో AI నిపుణుల అవసరం సుమారు 51 శాతం పైగా ఉంటుంది. 2026 నాటికి ఈ అవసరం మరింత పెరిగి, 10 లక్షల మందికి పైగా AI నిపుణులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు.
విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు
ఈ క్రమంలో AI, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ (Machine Learning) వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణుల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఎంట్రీ-లెవల్ నైపుణ్యాలపై ధ్యాస పెట్టిన ఈ కోర్సులు డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు కూడా నేర్చుకోవచ్చని చెబుతున్నారు. ఈ కోర్సులను ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ (Future Skills Prime) అనే ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనున్నారు. ఈ శిక్షణతో విద్యార్థులు డేటా విశ్లేషణ, డేటా ఆర్కిటెక్చర్, AI/ML మోడల్స్ వంటి అంశాలలో నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఉంది.
ఈ శిక్షణ కోర్సులు భారతదేశ జాతీయ విద్యా విధానం (National Education Policy) 2020కు అనుగుణంగా రూపొందించబడ్డాయి.
Also Read: SBI YOUTH FOR INDIA FELLOWSHIP 2025 | Eligibility: Degree | Fellowship: 3,27,000 Per year

Leave a Reply