SSC MTS Recruitment 2024 – 8326 MTS and Havaldar Posts
SSC MTS Recruitment 2024: కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 8326
పోస్టుల వారీగా ఖాళీలు
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ – 4887
హవల్దార్ (గ్రూప్ సీ నాన్ మినిస్టీరియల్) – 3439 ఖాళీలు
అర్హత
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు అర్హులు
వయస్సు (2024, ఆగస్టు 1 నాటికి )
ఎంటీఎస్ పోస్టులకు 18- 25 ఏళ్ళు
హవల్దార్ పోస్టులకు 18- 27 ఏళ్ళు
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఎంటీఎస్ పోస్టులకు
» కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ను నిర్వహిస్తారు
హవల్దార్ పోస్టులకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టి) ద్వారా
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను ఇంగ్లిష్/హిందీతోపాటు 13 స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు.
>తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు
దరఖాస్తు రుసుము
| SC/ST/PWBD | Free |
| Others | రూ. 100 |
| మహిళా అభ్యర్థులు | Free |
పరీక్ష విధానం:
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
సీబీఈలో రెండు సెషన్లు ఉంటాయి.
–>మొదటి సెషన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్పై ప్రశ్నలు ఇస్తారు
పరీక్ష సమయం – 45 నిమిషాలు.
ప్రశ్నల సంఖ్య – 40
మార్కులు – 120
–> సెషన్-2లో జనరల్ ఆవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 150 మార్కులు. అంటే ఒక్క ప్రశ్నకు 3 మార్కులు.
» పరీక్ష సమయం – 45 నిమిషాలు
నోట్: సెషన్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. సెషన్-2లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కును కోతవిధిస్తారు.
పీఈటీ
» హవల్దార్ పోస్టులకు నిర్వహించే పీఈటీలో పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి. మహిళలు అయితే ఒక కిలోమీటరు దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలి.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్)
» పురుషులు కనీసం 157.5 సెంమీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. గాలి పీల్చినప్పుడు కనీసం ఐదు సెం.మీ వ్యాకోచించాలి.
» మహిళలు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
| నోటిఫికేషన్ విడుదల తేదీ | 27 జూన్ 2024 |
| ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది | 27 జూన్ 2024 |
| దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ | 31 జూలై 2024 (రాత్రి 11) |
| ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ | 01 ఆగస్టు 2024 (రాత్రి 11) |
| SSC MTS పరీక్ష తేదీ 2024 (పేపర్ I) | అక్టోబర్-నవంబర్ 2024 |
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
SSC MTS Recruitment 2024 Notification PDF
Apply Here
Also Read: PNB Apprentice Recruitment 2024 | Apply Online for 2700 Vacancies

Leave a Reply