Press ESC to close

Stock Markets Today: భారీ నష్టాల తరువాత రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Markets Today: దేశీ స్టాక్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పరిస్థితులు మెరుగవడంతో సూచీలు విజయ బాట పట్టాయి. ఉదయం 9:27 గంటలకు సెన్సెక్స్ 391 పాయింట్లు లాభపడి 74,773 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 22,717 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.42 వద్ద ప్రారంభమైంది.



సెన్సెక్స్-30 ఇండెక్స్‌లో ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎల్ అండ్ టి, టిసిఎస్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌యుఎల్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం, టైటాన్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.



ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు రావడంతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన వెంటనే సూచీలు లాభాల బాట పట్టాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాలను పొందుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఎస్ అండ్ పీ 1.18 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.95 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 78.59 డాలర్లకు చేరువలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *