Supreme Court Allows Gyanvapi Mosque Survey: జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) నిరాకరించింది. సర్వేపై స్టే విధించాలన్న అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పును సవాల్ చేస్తూ మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.శాస్త్రీయ సర్వేపై స్టే విధించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది.
నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో సర్వే ప్రక్రియ మొత్తం జరపాలని అధికారులను కోరింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది. ASI సంస్థ చరిత్ర లోకి లోతుగా వెళ్లాలని అనుకుంటోందని అంజుమన్ ఇంతేజమియా మజీద్ కమిటీ వాదనలు వినిపించింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోదరభావం, లౌకికవాదానికి ఆటంకం కలిగిస్తోందన్నారు. మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చడాన్ని ప్రార్థనా స్థలాల చట్టం 1991 నిషేధిస్తోందన్నారు.

Leave a Reply