
Telangana Budget 2024 Highlights
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో (Telangana Assembly) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం. మొత్తం 2.75 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీల పథకాల అమలుకు రూ. 53 196 కోట్లు.
బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు
- పరిశ్రమల శాఖ 2,543 కోట్లు
- ఐటి శాఖకు 774 కోట్లు.
- పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
- పురపాలక శాఖకు 11,692 కోట్లు
- మూసీ రివర్ ఫ్రాంట్ 1000 కోట్లు
- ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250 కోట్లు
- ఎస్సీ సంక్షేమం 21,874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం 13,013 కోట్లు
- మైనార్టీ సంక్షేమం 2,262 కోట్లు
- బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు
- బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
- విద్యుత్ – గృహ జ్యోతికి 2,418 కోట్లు
- విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు
- గృహ నిర్మాణానికి 7,740 కోట్లు
- నీటి పారుదల శాఖకు 28,024 కోట్లు
- విద్యా రంగానికి 21,389కోట్లు
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
- వ్యవసాయ శాఖ 19,746 కోట్లు
- వైద్య రంగానికి 11,500 కోట్లు
TSPSCకి బడ్జెట్లో రూ. 40 కోట్ల
జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తాం
త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుంది
త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు
గ్రూప్ -1 లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన
మా ప్రభుత్వం ఆరు గ్యారంటీ ల అమలుకు కట్టుబడి ఉంది..
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసి కి నెలకి 300 కోట్ల చొప్పున అదనపు నిధులు..
మహాలక్ష్మి ,రాజీవ్ ఆరోగ్య శ్రీ , గృహజ్యోతి ,500 గ్యాస్ లకి కలిపి 53,196 కోట్ల కేటాయింపు..
బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ లో 8000 కోట్లు కేటాయింపు
బీసీ గురుకుల భవనాల కోసం 1546 కోట్లు కేటాయింపు..
బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..

Leave a Reply