Press ESC to close

Good News: అంగన్‌వాడీల్లో 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం

Telangana Anganwadi Recruitment News: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీచేయబోతోంది. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 6,399, హెల్పర్‌ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకానున్నాయి.

పదవీ విరమణ చేయనున్న వారితోనూ కలిపి రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తో పాటు హెల్పర్‌ (Helper) తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది.

ఇంటర్మీడియట్‌ అర్హత తప్పనిసరి

ఇంతకముందు అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీసం పదో తరగతి (SSC) పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం.. టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్‌ (Inter)పాసైన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్‌ అర్హతను తప్పనిసరి చేయనున్నారు.

వయోపరిమితి
18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది.

పదవీ విరమణ చేయనున్న సిబ్బంది: 3,914
టీచర్‌ పదోన్నతులకు అర్హులైన సహాయకులు: 567
ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు: 1,918
ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు: 7,837
భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు: 14,236

Telangana Anganwadi జిల్లాల వారీగా ఖాళీలు 

telangana anganwadi

Also Read: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2025 – 50 సివిల్ జడ్జి పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *