
Telangana SCCL Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఈ 272 ఖాళీలు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసారు. 2024 మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థుల నుంచి మార్చి 18వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్: 139
మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఎ), ఈ2 గ్రేడ్: 22
మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్), ఈ2 గ్రేడ్: 22
మేనేజ్మెంట్ ట్రైనీ (ఐఈ), ఈ2 గ్రేడ్: 10
జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 10
మేనేజ్మెంట్ ట్రైనీ (హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్: 02
మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్), ఈ2 గ్రేడ్: 18
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 03
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్: 30
నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
సబ్-ఓవర్సీర్ ట్రైనీ (సివిల్), టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 16
వయస్సు:
గరిష్ఠంగా 30 ఏళ్లు మించకూడదు. జీడీఎంవో పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారం తేదీ: మార్చి 1, 2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 18, 2024

Leave a Reply