Press ESC to close

వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!

Telangana Traffic Challans : ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. కాగా నిబంధలను పాటించకుండా ఉండడం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పోలీసులు తెలిపారు. వీటన్నికి అదుపు చేసేందుకు రూల్స్ ని, ఫైన్స్ ని స్ట్రిక్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

హెల్మెట్ లేకపోతే రూ.235 ఫైన్ .. !
 హెల్మెట్ ధరించకుండా వాహనంపై ప్రయాణం చేస్తే రూ.200 ఫైన్ విధించనున్నారు. మొత్తం సర్వీస్ ఛార్జీలతో కలిపి రూ.235 ..  రోజు రోజుకు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం… మరియు ఎక్కువగా పైగా రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు పోతున్నాయని పోలీసులు చెప్పారు.

 ఇంతకముందు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.100 ఫైన్ వేసే వారు. సర్వీస్ ఛార్జీలు అదనంగా వసూలు చేసే వారు. రూ.35 సర్వీస్ ఛార్జితో కలిపి రూ.135 చలానా విధించే వారు. అయితే ప్రస్తుతం ఏకంగా రూ.100 పెంచి వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు.

Telangana Traffic Challans: రాంగ్ రూట్ @2000 ఫైన్.. !
రాంగ్ సైడ్ ‌‌ డ్రైవింగ్ ‌‌ చేస్తే రూ.2వేలు జరిమానా విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.  గతంలో రాంగ్ రూట్ లో వస్తే రూ.1000 ఫైన్ విధించే వారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *