
TET -Psychology Special ప్రాక్టీస్ బిట్స్
1. పెరుగుదల-వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించి అవగాహన కల్పిస్తుంది?
1) విద్యార్థుల స్మృతి
2) విద్యార్థుల సర్దుబాటు
3) విద్యార్థుల అభ్యసనం
4) విద్యార్థుల వైయక్తిక భేదాలు
2. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు, తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపి తన భయాన్ని తెల్ల ఎలుకకే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం?
1) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
2) వికాసం క్రమానుగతమైనది
3) వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది
4) వికాసం సంచితమైనది
3. విషయ ప్రణాళిక రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఏకీకృతం
4) వికాసం ఒక పరస్పర చర్య
4. రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం ఏది?
1) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
2) వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం ఒక పరస్పర చర్య
5. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్లు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం?
1) వికాసం సంచితం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
6. తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండటాన్ని సూచించే వికాస నియమం ఏది?
1) వికాసం ఏకీకృత మొత్తం
2) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
3) వికాసం సంచితం
4) వికాసం ఒక పరస్పర చర్య
7. శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం?
1) వికాసం సంచితం
2) వికాసం అవిచ్ఛిన్నం
3) వికాసం ఒక పరస్పర చర్య
4) వికాసం క్రమానుగతం
8. ‘కౌమార దశలో శారీరక, మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి’ అనే వాక్యాన్ని సమర్థించే వికాస నియమం ఏది?
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
2) వికాసం సులభ అంశాల నుంచి జఠిల అంశాలకు సంభవిస్తుంది
3) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
4) వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది
9. శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు, చేతివేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం?
1) వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
3) వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది
4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
10. చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది?
1) వికాసం సంచితం
2) వికాసం క్రమానుగతం
3) వికాసం అవిచ్ఛిన్నం
4) వికాసం ఏకీకృతం
Answers:
1. 4 2. 3 3. 1 4. 2 5. 3
6. 2 7. 4 8. 1 9. 3 10. 2

Leave a Reply