The Real Heroes Behind India’s Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 (Chandrayaan-3) సూపర్ సక్సెస్ అయ్యింది. జాబిల్లి(Moon)దక్షిణ ధృవంపై కాలు మోపిన ల్యాండర్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మరే దేశం కూడా చంద్రుడి దక్షిన ధృవంపై కాలు మోపలేదు.
ఇస్రో చైర్మన్- ఎస్ సోమనాథ్ (ISRO Chairman Somanath)
చంద్రయాన్ -3 మిషన్ సక్సెస్ లో అందరి కంటే ముందు వరుసలో ఉన్నది ఇస్రో చైర్మన్ సోమనాథ్(Somanath). జనవరి 2022లో ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ బాధ్యతలు స్వీకరించారు(అంతకు ముందు వారు శివన్). సోమనాథ్ 1985లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో చేరాడు.చంద్రయాన్-3తో పాటు, గగన్‌యాన్ (Gaganyaan), ఆదిత్య-ఎల్1 (Aditya L1)లాంటి ఎన్నో మిషన్ లలో ఆయన పాత్ర ముఖ్యమైనది.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్-వీరముత్తువేల్(P. Veeramuthuvel)
వీరముత్తువేల్ చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా 2019లో బాధ్యతలు స్వీకరించారు. చంద్రయాన్-2 మిషన్(Chandrayaan-2 mission)లో కూడా కీలక పాత్ర పోషించారు. తమిళనాడులోని విల్లుపురంకు చెందిన వీముత్తువేల్.. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-M) పూర్వ విద్యార్థి.
కే. కల్పన
ఈమే Chandrayaan-3 ప్రయోగానికి డిప్యూటీ డైరెక్టర్ గా తన సేవలను అందించారు. చంద్రయాన్-2(Chandrayaan-2), మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు.
ఎం. వనిత
చంద్రయాన్-3లో U R రావు సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వనిత .
చంద్రయాన్-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
చంద్రయాన్-3 ప్రయోగానికి నాయకత్వం వహించిన తొలి భారత మహిళగా ఈమె గుర్తింపు పొందారు.
VSSC డైరెక్టర్- ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్(S. Unnikrishnan Nair)
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (Vikram Sarabhai Space Centre)లో ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ టీమ్ చంద్రయాన్-3 విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. VSSCలోని ఆయన బృందం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మార్క్-3ని అభివృద్ధి చేసింది.
U R రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్- శంకరన్
U R Rao Satellite Centre డైరెక్టర్‌గా జూన్ 2021లో బాధ్యతలు స్వీకరించారు. దేశీయ ఉప్రగ్రహాలను డెవలప్ చేసి ఇస్రోకి ఇవ్వడంలో URSC సాయం చేస్తుంది.
శంకరన్ నాయకత్వంలో URSC టీమ్ కమ్యూనికేషన్ (Team Communication), వాతావరణ సూచన (Environment), రిమోట్ సెన్సింగ్ (Remote Sense), నావిగేషన్ గ్రహాల అన్వేషణతో సహా ఇస్రో అవసరాలను తీర్చగల ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుంది
మిషన్ డైరెక్టర్: మోహన్న కుమార్
మోహన్న కుమార్ LVM3-M4/చంద్రయాన్-3 కోసం మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త.
లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చీఫ్: రాజరాజన్
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR) డైరెక్టర్‌గా రాజరాజన్ ఉన్నారు. ది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని దేశపు రాకెట్ పోర్ట్)- రాకెట్‌కు ఇంధనాన్ని అందిస్తుంది . లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ (LAB) లాంచ్ కోసం అనుమతినిస్తుంది.

Leave a Reply