నిరుద్యోగులకు గొప్ప అవకాశం – పరీక్ష లేకుండానే ఆర్టీసీలో ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 16లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
2018 -2023 సంవత్సరాల మధ్య డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు:
21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
కేవలం మెరిట్ ఆధారంగా పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది.విద్యార్హత, ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ:
ఎంపికైన అభ్యర్థులకు 3 ఏళ్ల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో మొదటి సంవత్సరం నెలకు రూ.15000/-, రెండవ సంవత్సరం రూ.16000/-, మూడవ సంవత్సరం రూ.17000/- చొప్పున ఉపకార వేతనం.
ఖాళీల వివరాలు:
హైదరాబాద్ – 26
సికింద్రాబాద్ – 18
మహబూబ్ నగర్ – 14
మెదక్ – 12
నల్లగొండ – 12
రంగారెడ్డి – 12
ఆదిలాబాద్- 09
కరీంనగర్ – 15
ఖమ్మం – 09
నిజామాబాద్ – 09
వరంగల్ – 01గా
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
https://nats.education.gov.in/ వెబ్సైట్ ను సందర్శించి,
Student Register లో మీ వివరాలను పొందుపరచాలి.
తరువాత Student Login లో అప్లై చేసుకోవాలి.

Leave a Reply