UPSC CSE Notification 2024
సివిల్ సర్వీసెస్ పరీక్షల (Civil Service Exam) కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ (Prelims) ఎగ్జామ్ మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
UPSC CSE Notification 2024 లో ముఖ్యాంశాలివే..
విద్యార్హతలు:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100/- (Women, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
ప్రిలిమినరీ ఎగ్జామ్:
ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు.
మెయిన్స్ పరీక్ష:
ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, వరంగల్
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
Also Read: Punjab National Bank Recruitment 2024 – 1025 Specialist Officer Posts

Leave a Reply