
Vemulawada Lady Home Guard Anusha: ద్వారకా శేఖర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంలో ఏఈగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అదే సమయంలో స్థానిక వడ్ల అనూష వేములవాడ రాజన్న ఆలయంలో హోంగార్డుగా పని చేస్తుంది. ఓ రోజు భర్త ఆరోగ్యం బాగోలేకపోవడంతో శేఖర్ వద్ద సుమారు రూ.3.50 లక్షలు అప్పు తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో శేఖర్ అడిగాడు.
దీంతో ఆమె అసలు రంగు బయటపడింది. డబ్బు ఎగ్గొట్టేందుకు కొత్త నాటకం మొదలు పెట్టింది. శేఖర్ పై తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఆమెను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేసింది. ఆగకుండా పెళ్లి పత్రికలు మరియు మార్ఫింగ్ ఫోటోలతో రచ్చ చేసింది.
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మళ్లీ రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. శేఖర్ మొదట్లో భయపడ్డాడు… ఆ తర్వాత మెల్లగా ధైర్యం తెచ్చుకున్నాడు. బాధితుడు శేఖర్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన సంఘటన గురించి పోలీసులకు చెప్పాడు. పోలీసులు అనూషను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు
అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనూష ధనవంతులను టార్గెట్ చేస్తుందని తెలిసింది. వారిని గుర్తించి డబ్బు ఎర చూపి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఏఈ ఉచ్చులో చిక్కుకున్నాడు. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
మరో వ్యక్తి దగ్గర 40 లక్షలు..
ఏఈ శేఖర్ దగ్గర 8 లక్షలు కాకుండా వేములవాడ కి చెందిన మరో వ్యక్తి దగ్గర 40 లక్షలు తీసుకున్నట్టు సమాచారం.. బాధితుడు పోలీసులును ఆశ్రయించాడు.

Leave a Reply