Press ESC to close

విశాఖ‌ పెట్రోలియం యూనివ‌ర్సిటీలో నాన్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Visakhapatnam IIPE Recruitment 2025 For Group ‘A’ Non-Teaching Positions on Direct Recruitment basis

Visakhapatnam IIPE Recruitment 2025: విశాఖ పెట్రోలియం యూనివర్సిటీలో 17 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల . అర్హత గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తారు.

విశాఖ‌ప‌ట్నంలోని ఇండియ‌న్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ (ఐఐపీఈ)లో నాన్ టీచింగ్ (సూపరింటెండింగ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల.

పోస్టులు
మొత్తం – 17
జూనియ‌ర్ అస్టిస్టెంట్ పోస్టులు – 10
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు (మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌)- 1
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు (కెమిక‌ల్ ఇంజినీరింగ్‌) – 1
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు (కంప్యూట‌ర్ సైన్స్‌)- 1
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు (కెమిస్ట్రీ)- 1
సూపరింటెండింగ్ ఇంజినీర్- 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

అర్హత‌
1. జూనియ‌ర్ అస్టిస్టెంట్ పోస్టులు : 55 శాతం మార్కులతో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేయాలి. రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. అడ్మినిస్ట్రేష‌న్‌, ఫైనాన్స్‌, స్టోర్స్ అండ్ ప‌ర్చెజ్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌, ఎంఎస్ ఆఫీస్‌, ఎక్స్ఎల్‌, ప‌వ‌ర్ పాయింట్ వంటివి రావ‌ల్సి ఉంది.

2. ల్యాబ్ అసిస్టెంట్ : సంబంధిత విభాగంలో 55 శాతం మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ చేయాలి. టీచింగ్, రీసెర్చ్ సంస్థల్లో ల్యాబొరేట‌రీస్‌లో ఇన్స్టిట్యూట్ రెండేళ్ల అనుభ‌వం ఉంది. లేక‌పోతే సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేయాలి. ఐటీఐ, ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఒకేష‌న‌ల్ ట్రైనింగ్‌లో 55 శాతంతో పూర్తి చేయాలి. ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. కంప్యూటర్ అప్లికేష‌న్‌, ఎంఎస్ వ‌ర్డ్‌, ఎక్స్ఎల్‌, ప‌వ‌ర్ పాయింట్ త‌ప్పనిస‌రిగా రావాలి.

3. సూపరింటెండింగ్ ఇంజనీర్ : 55 శాతంతో ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

4. అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 55 శాతంతో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

ALSO READ: పరీక్ష లేకుండా! IRCTC రిక్రూట్‌మెంట్ 2025 – అప్రెంటిస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

జీతం
జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్: రూ.32,000 నుంచి రూ.35,000
సూపరింటెండింగ్ ఇంజనీర్ (పీఎల్‌-13), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (పీఎల్‌-10): 7వ వేత‌నం సంఘం ప్రకారం వేత‌నం ఉంటుంది.

వ‌యోప‌రిమితి
జూనియ‌ర్ అసిస్టెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్ – 30 ఏళ్లు
సూపరింటెండింగ్ ఇంజినీర్ – 50 ఏళ్లు
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 40 ఏళ్లు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు
ఓసీ, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.100/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు, మ‌హిళ అభ్య‌ర్థుల‌కు అప్లికేష‌న్ ఫీజు నుంచి మిన‌హాయింపు ఉంది.

Official Website
Visakhapatnam IIPE Recruitment 2025 Notification PDF 1
Visakhapatnam IIPE Recruitment Notification PDF 2
Apply Online

ALSO READ: ఇంటర్ అర్హతతో CSIR CRRI రిక్రూట్‌మెంట్ 2025 – 209 పోస్టులకు నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *