
5538 Instructor and Aaya Jobs in Telangana Pre Primary Schools
5538 Instructor and Aaya Jobs in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సమగ్ర శిక్షా (Samagra Shiksha, Telangana) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొత్తగా 2,769 ప్రీ-ప్రైమరీ (Pre-Primary) సెక్షన్లను ప్రారంభించేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు
ఈ అకడమిక్ ఇయర్ (2026-27) నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
ఈ కొత్త ప్రీ-ప్రైమరీ సెక్షన్ల నిర్వహణ కోసం ప్రతి పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు (Pre-Primary Teachers) మరియు ఆయాలను (Aayas) నియమించనున్నారు.
ఈ నియామకాలను ఆయా జిల్లాల కలెక్టర్ల (District Collectors) ఆధ్వర్యంలో గౌరవ వేతనం ప్రాతిపదికన చేపడతారు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,769 పాఠశాలల్లో ఈ సెక్షన్లు మంజూరయ్యాయి. (5538 POSTS) వీటిని రెండు రీజియన్లుగా విభజించారు
CURE Region: 529 పాఠశాలలు
Non-CURE Region: 2,240 పాఠశాలలు
జీతం
ప్రీ-ప్రైమరీ టీచర్లు (Pre-Primary Instructors): నెలకు రూ. 8,000/-
ఆయాలు (Aayas): నెలకు రూ. 6,000/-
5538 Instructor and Aaya Jobs Eligibility
వయస్సు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి.
SC, ST, BC అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు (గరిష్టంగా 47 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు).
PWD (దివ్యాంగులైన) అభ్యర్థులకు: 10 సంవత్సరాల సడలింపు (గరిష్టంగా 54 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు).
విద్యార్హత :
ఇంటర్ – టీచర్
7వ తరగతి – ఆయా
5538 Instructor and Aaya Jobs District Wise Vacancies

దరఖాస్తు విధానం :
ఈ పోస్టులకు కేవలం ఆఫ్‌లైన్ (Offline) పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థులు జిల్లా కలెక్టర్లు లేదా స్థానిక విద్యాశాఖాధికారి (DEO/MEO) కార్యాలయం విడుదల చేసే నోటిఫికేషన్ ఆధారంగా, నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, అవసరమైన విద్యార్హత, కుల ధృవీకరణ పత్రాలను జతచేసి సంబంధిత కార్యాలయంలో స్వయంగా అందించాల్సి ఉంటుంది.

Leave a Reply