
AP DMHO IDSP Recruitment 2026 – Apply For Data Entry Operator, Lab Assistant & Data Manager Posts
AP DMHO IDSP Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా DM&HO నియంత్రణలో ఉన్న DPHFW-IDSP-DSU పరిధిలోని జిల్లా ఆరోగ్య సంస్థలలో కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో డేటా మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 18.07.2026 సాయంత్రం 05:30 గంటల లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
పే స్కేల్ రూ.15,000/- to రూ.36,225/- ఉంది. ఇంటర్మీడియట్, డిప్లమా & ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఆఫ్ లైన్ దరఖాస్తుకుప్రారంభ తేదీ : 09 జూలై, 2026
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18 జూలై, 2026
ఖాళీలు
డేటా మేనేజర్ – 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)-01
ల్యాబ్ అసిస్టెంట్ -01
అర్హత
డేటా మేనేజర్ : అభ్యర్థికి కంప్యూటర్ సైన్స్‌లో నిర్దేశించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో పాటు కనీసం 01 సంవత్సరం అనుభవం, లేదా ఐటి/ఎలక్ట్రానిక్‌లో బి.ఇ. అర్హత ఉండాలి. ఆరోగ్య లేదా సామాజిక రంగంలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ల్యాబ్ అసిస్టెంట్ : అభ్యర్థి ల్యాబ్ అటెండెంట్ 01 పోస్ట్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ విత్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్సును పూర్తి చేసి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం 1 సంవత్సరం డిప్లొమాతో పట్టభద్రులు
దరఖాస్తు రుసుము
ఓసీ, బీసీ అభ్యర్థులకు: రూ. 500/-
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు: రూ.350/-
శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు: No FEE
వయో పరిమితి
కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు
జీతం
నెలకు రూ.₹15,000/- to రూ.36,225/-
అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం
విద్య అర్హత మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి
అర్హులైన అభ్యర్థుల నుండి 09.07.2026 ఉదయం 10:00 గంటల నుండి 18.07.2026 సాయంత్రం 05:30 గంటల వరకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
పూరించిన దరఖాస్తులను IDSP విభాగం, 3వ అంతస్తు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, శ్రీకాకుళం-532001లో సమర్పించాలి.

Leave a Reply