Press ESC to close

APSRTC లో 309 అప్రెంటిస్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల.

అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి

అభ్యర్థులు నవంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులకు నవంబరు 16న కర్నూలులోని RTC జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాలు పరిశీలించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థులు వివరాల కోసం 08518-257025, 7382869399, 7382873146 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి.



అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల ఖాళీల సంఖ్య: 309
జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.
ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌తోపాటు ఇచ్చిన రెజ్యూమ్ ఫార్మాట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దాన్ని నింపి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీలను జతచేసి నిర్ణీత తేదీ రోజు ధ్రువపత్రాల పరిశీలను హాజరుకావాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టులో మార్కులు, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ అధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.



అవసరమయ్యే సర్టిఫికేట్లు..
అభ్యర్థి ప్రొఫైల్
అప్రెంటిస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబరు
SSC మెమో
ITI మార్కుల మెమో
ఆధార్ కార్డు

దరఖాస్తు సమర్పణ, సర్టిఫికేట్ల పరిశీలన వేదిక:
Principal,
Zonal Staff Training College,
APSRTC,
Bellary Chowrastha, Kurnool (PO)& Dt.



ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.11.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 16.11.2023.

Notification

Apply Here

Also Read: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
Join Our Whatsapp Channel for Latest Updates: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *