Press ESC to close

విద్యార్థులకు శుభవార్త.. LIC నుండి15,000/- నుంచి రూ.50,000/- వరకు స్కాలర్షిప్ | 10th, 12th, Degree & PG

LIC Golden Jubilee Scholarships 2026 – Application Form

LIC Golden Jubilee Scholarships 2026 – Application Form : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా విద్యార్థులకు శుభవార్త. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2026 -27 ద్వారా 10వ తరగతి & ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీలో చేరి పేద, విద్యార్థుల కోసం రూ.15,000/- నుంచి రూ.50,000/- ఆర్థిక సహాయం. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30.

స్కాలర్‌షిప్ మొత్తం




[A]. సాధారణ స్కాలర్‌షిప్ [12వ తరగతి / డిప్లొమా తర్వాత]

వైద్య రంగంలో (MBBS, BAMS, BHMS, BDS) ఉన్నత విద్యను అభ్యసించే ఎంపికైన స్కాలర్‌కు సంవత్సరానికి రూ. 50,000/- మొత్తం ప్రదానం చేయబడుతుంది మరియు కోర్సు వ్యవధిలో ప్రతి సంవత్సరం రూ. 25,000/- చొప్పున రెండు వాయిదాలలో చెల్లించబడుతుంది.

ఇంజనీరింగ్ రంగంలో (BE, BTECH, BArch) ఉన్నత విద్యను అభ్యసించే ఎంపికైన స్కాలర్‌కు సంవత్సరానికి రూ. 40,000/- మొత్తం ప్రదానం చేయబడుతుంది మరియు కోర్సు వ్యవధిలో ప్రతి సంవత్సరం రూ. 20,000/- చొప్పున రెండు వాయిదాలలో, అర్హతకు లోబడి చెల్లించబడుతుంది.

ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల ద్వారా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు లేదా ఇతర సమానమైన కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో (ఐటీఐలు) కోర్సులు అభ్యసించే ఎంపికైన స్కాలర్‌లకు సంవత్సరానికి రూ.20,000/- మొత్తం ప్రదానం చేయబడుతుంది మరియు కోర్సు వ్యవధిలో ప్రతి సంవత్సరం రూ.10,000/- చొప్పున రెండు వాయిదాలలో చెల్లించబడుతుంది.




[B]. ప్రత్యేక స్కాలర్‌షిప్ [10వ తరగతి తర్వాత]

ప్రత్యేక స్కాలర్షిప్ 10వ తరగతి తర్వాత 2023 to 2026 విద్య సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత అయిన 60% గ్రేడింగ్ వచ్చిన అభ్యర్థులు 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లమా & ఐటిఐ కోర్సు మొదటి ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు.
వీరి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ₹4.50 లక్షల లోపు ఉండాలి. ఈ సంవత్సరంలో రూ.15,000/- పొందొచ్చు.

LIC యొక్క 112 డివిజన్ కార్యాలయాలలో ఒక్కొక్క డివిజన్లో 120 మంది విద్యార్థులకు ఎంపిక చేస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో https://licindia.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. LIC Golden Jubilee Scholarships 2026 Apply Link మీద క్లిక్ చేసి అడిగినటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేసి వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాలు కింద PDF ఇవ్వడం జరిగింది చూడండి.

LIC Golden Jubilee Scholarships Application Form




LIC Golden Jubilee Scholarship 2026 Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *